AP: మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా విద్యాసంస్థలకు మరోసారి సెలవులు పొడిగించారు. అన్ని స్కూళ్లు, కాలేజీలకు ఈనెల 31 వరకు సెలవులు కొనసాగనున్నాయి. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ తెలిపింది. తుఫాన్ ప్రభావం తగ్గిన తర్వాత పరిస్థితులను సమీక్షించి పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటారు.