MLG: మొంథా తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. ప్రజలు చెట్ల వద్ద ఉండకూడదని, అత్యవసరమైతేనే బయటికి రావాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కి సంప్రదించాలని కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు భద్రతా చర్యలు పాటించాలని, అధికారులు స్పందించాలని ఆదేశించారు.