హనుమకొండ జిల్లా కేంద్రంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జిల్లా అధికారులతో బుధవారం పరిస్థితిని సమీక్షించారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తో పాటు రెవెన్యూ అధికారులతో వర్షం తీవ్రత లోతట్టు ప్రాంతాల్లో చేపట్టిన చర్యలపై చర్చించి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.