WGL: మొంథా తుఫాను ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో భారీ గాలులు, వర్షాలు కురుస్తున్నాయి. ఆయా జిల్లాల కలెక్టర్లు, ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు చేపలు పట్టడానికి, చెరువుల వద్దకు వెళ్లకూడదని, శిథిలావస్థ ఇండ్లలో ఉండకూడదని, అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచించారు. అధికారులు అందుబాటులో ఉన్నారని, ప్రమాదాలు జరగకముందే రక్షణ చర్యలు చేపడతారని స్పష్టం చేశారు.