సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. కొత్తచెరువు మండలం కొడవగానిపల్లిలో 31, వేములేటిపల్లిలో 25 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి చేరాయి. ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డిలు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.