PPM: భామిని మండలంలోని వంశధార నది తీర ప్రాంత గ్రామాలైన నేరడి, లివిరి గ్రామాలను డీఎస్పీ రాంబాబు సందర్శించారు. మొంథా తుఫాన్ నేపథ్యంలో వంశధార నదిలో నీటిమట్టం పెరిగి, నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున నది తీర గ్రామ ప్రజలు నదిలోకి స్నానంకు వెళ్లవద్దని సూచించారు. తుఫాన్ పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ ప్రసాదరావు పాల్గొన్నారు.