బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ ‘ది తాజ్ స్టోరీ’ మూవీ ఈ నెల 31న విడుదల కానుంది. అయితే ఈ మూవీ విడుదలను అడ్డుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ చిత్రం చారిత్రక వాస్తవాలను వక్రీకరించడంతో పాటు మత సామరస్యాన్ని దెబ్బతీస్తుందని పిటిషనర్ ఆరోపించారు. ఈ పిటిషన్పై స్పందించిన కోర్టు. ఈ అంశాన్ని సాధారణ విచారణలో భాగంగా పరిశీలిస్తామని తెలిపింది.