PLD: కావూరు-లింగంగుంట్ల బ్రిడ్జి వద్ద వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా బుధవారం అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వరద ప్రవహించే ప్రదేశంలో ప్రజలను అనుమతించవద్దని స్థానిక అధికారులకు ఆమె సూచించారు. అనవసరంగా ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని కలెక్టర్ హెచ్చరించారు.