ATP: మేడాపురం గ్రామానికి చెందిన ఆదినారాయణ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పరిటాల సునీత, మేడాపురంలోని ఆయన నివాసానికి వెళ్లి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆదినారాయణ వ్యవసాయపరంగా తమ కుటుంబానికి అండగా ఉండేవారని, ఆయన మరణం బాధాకరమని పేర్కొన్నారు.