SDPT: రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల స్మారక వారోత్సవాల ముగింపు సందర్భంగా, “మహా స్వచ్ఛంద రక్తదాన కార్యక్రమం” ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విశేష సేవలందించిన సిద్దిపేట జిల్లా గుగ్గిళ్ల గ్రామానికి చెందిన నచ్చరాజు నిహారికను రాష్ట్ర డీజీపీ శశిధర్ రెడ్డి, హైదరాబాద్ పోలీసు కమీషనర్ సజ్జనార్ శాలువాతో సన్మానించారు.