ప్రకాశం: హనుమంతునిపాడు మండలం లింగంగుంట్లలో మండల బీసీ సెల్ అధ్యక్షులు మద్ది తిరుపతయ్య ఆధ్వర్యంలో 15 కుటుంబాలు టీడీపీని వీడి కనిగిరి వైసీపీ ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్ వారికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నారాయణ యాదవ్ మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తానన్నారు.