ASF: వినియోగదారుడికి సేవల్లో నిర్లక్ష్యం వహించినందుకు విద్యత్ అధికారులకు వినియోగదారుల ఫోరం జరిమానా విధించింది. కాగజ్ నగర్లో ముస్తాఫ్ ఆలీ అనే వ్యక్తి ట్రాన్స్ ఫార్మర్ కావాలని డబ్బులు కట్టి అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోలేదు. దీంతో ఆయన వినియోగదారుల ఫోరంలో కేసు నమోదు చేశారు. దీని ఆధారంగా అధికారులకు రూ. 7000 జరిమానా విధించారు.