CTR: చౌడేపల్లె మండలం కాగతి గ్రామంలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంటి వద్ద పార్కింగ్ చేసిన బైకు నుంచి మంటలు చెలరేగాయి. అవి కాస్త ఇంట్లోకి వ్యాపించాయి. లోపల ఉన్న శారదమ్మ, తన కుమారుడు ఉదయ్ కుమార్ బయటకు పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పింది. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలను అదుపు చేశారు.