MDK: రామాయంపేట మండలం వెంకటాపూర్ (ఆర్)కు చెందిన క్యాదరి నర్సయ్య (67) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గత నెల 29న కనిపించకుండా పోయిన నరసయ్య శివారులోని ఓ పొలం వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం మృతుడిని గుర్తించారు. కుమారుడు తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.