KNR: ముఖ్య ప్రణాళిక అధికారి (Chief Planning Officer – CPO)గా పనిచేసిన ఆర్. రాజారాం ఉద్యోగ విరమణ చేయడంతో, ఆ స్థానంలో మంచిర్యాల సీపీఓగా ఉన్న వి. పూర్ణచంద్రారావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆర్థిక, గణాంకాల శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు వి. పూర్ణచంద్రారావు శుక్రవారం కరీంనగర్ సీపీఓగా బాధ్యతలు స్వీకరించారు.