తుఫాను ప్రభావిత ప్రాంతాలలో బాధితులకు నిత్యవసర వస్తువులు, బియ్యాన్ని అందించడం జరుగుతుందని. కలెక్టర్ నాగరాణి అన్నారు. వీరవాసరం మండలం కొణితివాడ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం పునరావాస కేంద్రంలోని బాధితులకు నిత్యవసర వస్తువులను అందించారు. భీమవరం నియోజకవర్గంలో తుఫాన్ వల్ల ఇబ్బంది పడిన 220 కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.1,000, బియ్యం, సరుకులను అందించామన్నారు.