GNTR: మాదక ద్రవ్యాల నియంత్రణకు ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాను మాదక ద్రవ్యాల రహితంగా మార్చడానికి గట్టి నిఘా అవసరమన్నారు. అనంతరం ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు 65 కేసులు నమోదు చేసి, 26 వాహనాలు సీజ్ చేశామని, ఏడుగురిపై పీడీ కేసుల నమోదు చేశామన్నారు.