NZB: తెలంగాణ SC, ST కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య ఈరోజు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారని అధికారులు తెలిపారు. నందిపేటలో కేదారేశ్వర ఆశ్రమాన్ని దర్శించనున్నారు. అనంతరం NZBలో కానిస్టేబుల్ ప్రవీణ్ కుటుంబాన్ని పరామర్శించి, కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం KMR సఖి కేంద్రాన్ని సందర్శించి, ఫరీద్పేట ఘటన బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.