VKB: దోమ మండల పరిధిలో అకాల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరి, పత్తి, మొక్కజొన్న, టమోటా, వేరుశెనగ పంటలు నాశనమయ్యాయి. పలుచోట్ల గాలికి వరి పంట కిందపడి నేలమట్టమైపోయింది. కష్టపడి సాగు చేసిన పంటలు నేలమట్టమవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.