కృష్ణా: మచిలీపట్నంలో జరుగుతున్న విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చర్యలను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు పరిశీలించారు. సర్కారు తోటలో భారీ వృక్షం నేలకొరిగి దెబ్బతిన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను పరిశీలించారు. పనులు వేగవంతం చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలన్నారు.