ADB: రాష్ట్ర ప్రజా ప్రభుత్వం పేదల కోసం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరలో పూర్తి చేస్తామని బోథ్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. ఆయన బుధవారం బజార్హత్నూర్ మండలంలోని వంజరి, భూతాయి గ్రామాల్లో పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. యధావిధిగా పనులు చేపట్టాలని గుత్తేదారులను ఆదేశించారు.