ప్రకాశం: ఒంగోలు నగరంలో వర్ష నీటితో మునిగిన బిలాల్ నగర్,కరుణా నగర్లను ట్రాక్టర్లో ఎక్కి పరిస్థితులను కలెక్టర్ రాజాబాబు బుధవారం పరిశీలించారు. ఒంగోలు నగరంలోని పలు ప్రాంతాలు జలమయం కాగా సమాచారం అందుకున్న కలెక్టర్ హుటాహుటిన ఉదయాన్నే కాలనీలను సందర్శించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమైనంత త్వరగా నీటిని తరలించాలని కలెక్టర్ ఆదేశించారు.