E.G: కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం నల్లజర్ల మండలం అనంతపల్లిలోని ఎర్ర కాలువ ప్రాంతాన్ని పరిశీలించారు. కాలువ మ్యాప్‌ను సమీక్షించి, ప్రస్తుత పరిస్థితిపై కిందిస్థాయి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం నల్లజర్ల ప్రాంతంలో మొలకలు వచ్చిన వరి పంట పరిస్థితిని కూడా ఆమె పరిశీలించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట కొవ్వూరు ఆర్డీవో సుస్మిత రాణి ఉన్నారు.