TG: జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతోపాటు మైనార్టీ నేతలు కూడా వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్‌కు అజారుద్దీన్ ధన్యవాదాలు తెలిపారు. కాగా కేబినెట్ విస్తరణలో భాగంగా అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.