HYD: కాంగ్రెస్ గెలుపు దిశగా ముందడుగు వేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలలో కాంగ్రెస్ తనదైన ముద్ర వేసిందన్నారు. ప్రజల నుంచి కాంగ్రెస్కు భారీ స్పందన ఉందని, కాంగ్రెస్ విజయం ఖాయమని స్పష్టం చేశారు.