NZB: ఇందల్వాయి మండల పరిధిలో అటవీ శాఖ అధికారులు బుధవారం పహారాలో అక్రమంగా టేకు కలపను తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు .ధర్పల్లి మండలం రామడుగు శివారు ప్రాంతంలో టాటా సుమో వాహనం (AP 09 AY 9580)ను ఆపి తనిఖీ చేశారు. పరిశీలనలో పట్టా భూమి నుండి అక్రమంగా టేకు దుంగలు తరలిస్తున్నట్టు తేలింది. వెంటనే వాహనాన్ని సీజ్ చేశారు.