CTR: కుప్పం రైడర్స్ ఆధ్వర్యంలో “గ్రేట్ ఆంధ్రా రైడ్” ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, పీఎంకే అర్బన్ డెవలప్మెంట్ ఛైర్మన్ డాక్టర్ సురేష్ బాబు, మున్సిపల్ ఛైర్మన్ సెల్వరాజ్ తదితరులు దీనిని ప్రారంభించారు. కాగా, నేతలు ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ కుప్పం ఖ్యాతిని ఈ రైడ్ ద్వారా చాటిచెప్పాలన్నారు.