ASR: మొంథా తుఫాను నేపథ్యంలో నలుగురు గర్భిణులను బర్త్ వెయిటింగ్ రూమ్‌కు తరలించామని కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం పీహెచ్సీ డాక్టర్ స్నేహలత బుధవారం తెలిపారు. సీహెచ్‌వో ప్రశాంత్ కుమార్, ఐసీడీఎస్ సీడీపీవో దేవమణితో కలిసి బూదరాళ్ల పంచాయతీ సాకులపాలెం, మంప పంచాయతీ ఆకులపాడు, చిక్కుడుపాడు, రేవళ్ల పంచాయతీ ఆర్.కంఠారం గ్రామాలకు చెందిన నలుగురు గర్భిణులను తరలించమన్నారు.