కృష్ణా: మొంథా తుపాన్ నేపథ్యంలో కోడూరు మండలం తీర ప్రాంత గ్రామ ప్రజలను సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన పునరావస కేంద్రాలను బుధవారం కలెక్టర్ డీకే బాలాజీ, జేసి నవీన్ సందర్శించారు. పునరావాస కేంద్రాలలో ఆహారం, తాగునీరు, వైద్య సామాగ్రి ఏర్పాట్లను గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు రోడ్లపై చెట్ల తొలగింపు చర్యలను స్వయంగా పరిశీలించారు.