ASF: జిల్లా కలెక్టరేట్ లో రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని కలెక్టర్ వెంకటేష్ దోత్రే, SP కాంతిలాల్ పాటిల్ తో కలిసి బుధవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని అన్నారు. ట్రాఫిక్ పోలీస్ విభాగం రోడ్లపై అనాధికార వాహన నిలుపుదల నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.