ASR: పాడేరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని బుధవారం ఆసుపత్రి సూపరింటెండెంట్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.హేమలతాదేవి సందర్శించారు. ఆసుపత్రిలోని అన్ని వార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న సౌకర్యాలు గురించి వాకబు చేశారు. రోగులు వాడుతున్న మందులు, వారికి అందుతున్న ఆహారం గురించి అడిగితెలుసుకున్నారు. ప్రసూతి విభాగంలో ఉన్న గర్భిణులను, బాలింతలను పరామర్శించారు.