NGKL: చారకొండ మండల వ్యాప్తంగా తుఫాన్ ప్రభావం దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని MRO ఉమా విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ నివసించరాదని హెచ్చరించారు. మండలంలోని గ్రామాల్లో ప్రజల సంరక్షణ కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. తుఫాన్ సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.