BDK: నిషేధిత మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ ఇటీవల జిల్లా పోలీసుల ఎదుట ముగ్గురు సభ్యులు లోంగిపోయిన విషయం తెలిసిందే. కాగా, ప్రభుత్వం ద్వారా మంజూరైన రివార్డును ఇవాళ ఎస్పీ రోహిత్ రాజు ముగ్గురు సభ్యులకు అందించారు. రామ్ సింగ్ కౌడే, ముచ్చికి సోందాల్, సోడి భీమే అనే సభ్యులకు రూ.9 లక్షల 50వేల నగదును చెక్కుల ఇచ్చారు.