సత్యసాయి: రొళ్ల మండల ఎంపీపీ, వైస్ ఎంపీపీలపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. వైసీపీ ఎంపీపీ కవిత, వైస్ ఎంపీపీలు నాగరాజు, రత్నమ్మ తమ పదవులు కోల్పోయారు. ఆర్డీవో ఆనంద్ కుమార్ అధ్యక్షతన జరిగిన అవిశ్వాస సమావేశానికి 11 మందికి గానూ 8 మంది ఎంపీటీసీలు హాజరయ్యారు. త్వరలో కొత్త ఎంపీపీ, వైస్ ఎంపీపీలు నియమితులు కానున్నారు.