MNCL: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మందమర్రిలోని కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి తరగతి గదులు, వంటశాల, రిజిస్టర్లు, మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో ఆహారం అందించాలని సూచించారు.