VZM: దత్తిరాజేరు మండలంలోని దత్తి గ్రామంలోనీ దళిత కాలనీ ముంపుకు గురికాకుండా రహదారి నిర్మించడంతోపాటు రిటర్నింగ్ వాల్ నిర్మించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు లక్ష్మి, జిల్లా కమిటీ నాయకులు జి. శ్రీనివాసులు డిమాండ్ చేశారు. బుధవారం దత్తి దళిత కాలనీ ముంపు ప్రాంతాన్ని వారు పరిశీలించారు. చుట్టూ నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.