NZB: భీమ్గల్ లక్ష్మీనృసింహాస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా లింబాద్రిగుట్ట గోవింద నామస్మరణతో మారుమోగింది. భక్తిశ్రద్ధలతో బుధవారం ధ్వజారోహణం కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణ మండలంలో గరుఢ పఠంపై స్వామివారి ఉత్సవ మూర్తుల ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టారు.