NLR: రాపూరు మండలంలోని నిమ్మ రైతులను నిలువునా ముంచేసింది. మొంథా తుఫాన్ ప్రభావంతో మంగళవారం రాత్రి వీచిన ఈదురు గాలులకు నిమ్మ చెట్లు వేరులతో సహా కొన్నిచోట్ల పైకి లేచాయి. నిమ్మచెట్ల పూత, పింది మొత్తం రాలిపోయాయి. వేగంతో వీచిన ఈదురు గాలులకు చాలా చెట్లు నేలవాలాయి. ఈ తుఫాను ప్రభావంతో నిమ్మ పూత, పిందెలు రాలిపోవడంతో నిమ్మ రైతులు కుదేలయ్యారు.