MDK: మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.18.7 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. నిరంతర కృషి, పలు శాఖలతో అనుసంధానం ద్వారా ఈ నిధులను సాధించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ నిధులతో రోడ్లు, డ్రైనేజీ పనులు, తాగునీటి సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. మెదక్ అభివృద్ధి పట్ల ఉన్న తమ అంకితభావంతోనే ఈ నిధులు సద్యమయ్యాయన్నారు.