TG: క్రీడల ద్వారా యావత్ దేశానికి అజారుద్దీన్ సేవలందించారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అయితే, ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్లో తీసుకోవాలన్న కాంగ్రెస్ నిర్ణయాన్ని బీజేపీ నేతలు ఈసీ వద్ద విషం వెళ్లగక్కుతూ అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఒక గొప్ప క్రీడాకారుడికి మంత్రివర్గంలో అవకాశం వస్తుంటే అనైతికంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.