అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో వరద నీరు గత నాలుగు రోజులుగా నిలిచిపోవడంతో ప్రయాణికులు పలు అవస్థలు పడుతున్నట్లు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. గురువారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. సమస్యను వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.