HYD: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఇంటికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వెళ్లారు. ఇటీవల హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ కవిత తన కుటుంబ సమేతంగా హరీష్ రావు ఇంటికి వెళ్లారు. సత్యనారాయణ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ.. హరీష్ రావుతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.