ATP: బాగేపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ బాబురెడ్డి సంతాప సభలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆయన బాబురెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. బాబురెడ్డి బాగేపల్లిపై ప్రత్యేక ముద్ర వేసుకున్నారని, ఆయన ఆత్మ బాగేపల్లిపైనే ఉంటుందని కొనియాడారు. ప్రజలకు ఆయన చేసిన సేవలు శాశ్వతంగా గుర్తుండిపోతాయన్నారు.