ASR: తుఫాను అనంతరం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున సచివాలయ ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈమేరకు గురువారం కొయ్యూరు మండలం బంగారమ్మపేట-2 సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ జ్యోతి, వెల్ఫేర్ అసిస్టెంట్ రాజుబాబు, మహిళా పోలీసు మణి రాజుపేట, పరదేశిపాకలు గ్రామాల్లో పర్యటించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.