కృష్ణా: అంగలూరు గ్రామంలో ఈరోజు గాలులు, వర్షం కారణంగా ఒక పెద్ద చెట్టు విరిగి రహదారిపై పడిపోయింది. ఈ ఘటనతో కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సమాచారం అందుకున్న గ్రామ పంచాయతీ సిబ్బంది, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.