ATP: గుత్తిలోని ఇండస్ట్రియల్ ఏరియాలోని సోలార్ పవర్ ప్లాంట్‌లో చోరీ జరిగింది. దొంగలు సోలార్ పవర్ ప్లాంట్‌లోకి చొరబడి రూ. 7 లక్షల విలువైన 10 వేల మీటర్ల కేబుల్ వైర్లలో ఉన్న కాపర్‌ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై సోలార్ పవర్ ప్లాంట్ టెక్నీషియన్ వెంకటరాముడు పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.