W.G: ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా శుక్రవారం తణుకులో పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. తొలి కేంద్ర కార్మిక సంఘంగా 1920 అక్టోబర్ 31న బొంబాయి నగరంలో ఆవిర్భవించిన ఏఐటీయూసీ నిర్విరామంగా నిర్వహించిన కార్మికోద్యమాలు, పోరాటాల ఫలితంగానే కార్మిక హక్కులు, చట్టాలు సాధించుకోవడం జరిగిందని జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు అన్నారు.