GNTR: తుఫాన్ కారణంగా ప్రత్తి పొలాల్లో నిలిచిన నీటిని రైతులు వెంటనే తొలగించాలని ప్రత్తిపాడు మండల వ్యవసాయ అధికారి షేక్ సుగుణ బేగం సూచించారు. పంట పునరుద్ధరణ కోసం ఎకరానికి 25–30 కిలోల యూరియా, 10–15 కిలోల మూర్రేట్ ఆఫ్ పొటాష్ అదనంగా వేయాలని సూచించారు. వాతావరణం అనుకూలించిన వెంటనే పలుమార్లు అంతర కృషి చేయాలని రైతులకు సూచించారు.