NRML: జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియను ఎటువంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. బుధవారం లోకేశ్వరం మండల హవర్గా గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, రైతులకు అవసరమైన సదుపాయాలు, తూకపు యంత్రాలు, తేమ యంత్రాలు, టార్పాలిన్లు వంటివి సక్రమంగా ఉండేలా చూడాలని సూచించారు.