GNTR: తుఫాన్ దృష్ట్యా గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర ముందస్తు చర్యలను సమీక్షించారు. బుధవారం బుడంపాడులోని పునరావాస కేంద్రాన్ని సందర్శించిన ఆయన, ప్రజలతో మాట్లాడి, మౌలిక సదుపాయాల గురించి ఆరా తీశారు. ఆహారం, తాగునీరు లోపం లేకుండా చూడాలని, ముఖ్యంగా చిన్నారులు, గర్భిణుల సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.